ఒత్తైన కనురెప్పల కోసం...

27-12-2018: మస్కారాతో పని లేకుండా కనురెప్పలు సహజసిద్ధంగా ఒత్తుగా కనిపించాలంటే... ఇవిగో ఈ సౌందర్య చిట్కాలు పాటించాలి.

రాత్రి నిద్రపోయే ముందు తాజా ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం తీసుకుని, దాన్లో ఇయర్‌ బడ్‌ ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.
నిమ్మ తొక్కును ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదంలో వేసి, ఒక వారం తర్వాత ఆ నూనెను కనురెప్పలకు పూసుకున్నా ఫలితం ఉంటుంది.
 పెట్రోలియం జెల్లీలో మస్కారా బ్రష్‌ ముంచి, దాంతో కనురెప్పలు అద్దుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ఫలితం దక్కుతుంది.
 చల్లబరిచిన గ్రీన్‌ టీలో దూది ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి.
మూసిన కళ్లను మునివేళ్లతో సున్నితంగా మర్దన చేసుకున్నా, రక్తప్రసరణ పెరిగి కనురెప్పలు పెరుగుతాయి.
కనురెప్పలను ట్రిమ్‌ చేసుకున్నా, కుదుళ్లు ప్రేరేపితమై కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి
కనురెప్పలను వంపు తిప్పే ఐల్యాష్‌ కర్లర్ల వాడకం మానేయాలి. కనురెప్పలకు పెరిగే వీలు కల్పించాలంటే కర్లర్ల వాడకానికి బ్రేక్‌ ఇవ్వాలి.