మచ్చలేని చర్మం కోసం...

04-03-2019: చర్మం మీది మచ్చలు, మొటిమలు తొలగి కాంతివంతంగా మెరవాలంటే కొన్ని ఆయుర్వేద చికిత్సలు అనుసరించాలి. వంటింట్లో దొరికే దినుసులతో చర్మ సమస్యలను తొలగించుకోవడం సాధ్యమే! అదెలాగంటే...

పసుపు: సమపాళ్లలో పసుపు, సెనగపిండి కలిపి నీరు చేర్చి, ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లనీళ్లతో కడిగేయాలి.
కాకర: రెండు టీస్పూన్ల కలబంద గుజ్జు, ఒక టీస్సూను కాకర రసాన్ని కలిపి ముఖానికి పట్టించి రాత్రంతా వదిలేయాలి. ఉదయమే చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
దోస రసం: 5 టీస్పూన్ల దోస రసంలో ఒక టీస్పూను నిమ్మరసం కలిపి రాత్రి పడుకునేముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.
కొబ్బరినూనె: 1 టీస్పూను కొబ్బరినూనెలో ఒక చుక్క టీట్రీ ఆయిల్‌ కలిపి, ముఖానికి మర్దనా చేయాలి. తర్వాత కడిగేసుకుంటే ముఖం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.