తీరైన కనుబొమల కోసం...

30-01-2019: తీర్చిదిద్దిన కనుబొమలు ముఖసౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. కనుబొమలకు సొబగులు అద్ది, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలా చేయండి.
 
బ్రష్‌తో: మీకు నచ్చిన విధంగా కనుబొమలను మార్చుకునేందుకు మంచి బ్రష్‌ ఉపయోగించండి. పెన్సిల్‌ అవసరం లేకుండానే కనుబొమలను మందంగా, అందంగా కనిపించేలా చేసే బ్రష్‌ను వాడండి.
 
తొలగించడం: కనుబొమలను చూడచక్కగా మలిచేందుకు త్రెడింగ్‌ పద్ధతి మీదే ఆసక్తి చూపుతారు. కనుబొమల షేప్‌ కోసం అనవసరమైన వాటిని తీసేసి సరికొత్త లుక్‌ తెచ్చుకోండి.
 
పెన్సిల్‌, జెల్‌: క్రమపద్ధతిలో లేని కనుబొమల వెంట్రుకలను పెన్సిల్‌ లేదా జెల్‌ సాయంతో సరిచేయండి. తరువాత బ్రష్‌తో కనుబొమలను చక్కగా కనిపించేలా చేసుకోండి.
 
ఆర్చ్‌ లుక్‌: కనుబొమలను ఆర్చ్‌ లుక్‌లో తీర్చిదిద్దడం పాత ఫ్యాషన్‌ కాదు. కనుబొమల చివరన కొద్దిగా ఆర్చ్‌ లుక్‌ ఇస్తే ప్రత్యేకంగా కనిపిస్తాయి.