సొగసైన చర్మం కోసం..

19-12-2018: చలికాలంలో చర్మ సంరక్షణకు వంటింటి చిట్కాలివి...

నిమ్మ, టమాటో రసం: చలికాలం గాలిలో తేమ తక్కువగా ఉండడంవల్ల చర్మం పొడిబారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిమ్మ, టమాటో రసం మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, పావుగంట తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్‌-సి చర్మం పీహెచ్‌ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. టమాటో రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

పెరుగు, తేనె, అరటిపండు: చర్మం పీహెచ్‌ను తగ్గించేందుకు పెరుగు, తేనెను సమపాళ్లలో తీసుకోవాలి. దీనికి అరటిపండు గుజ్జు కలిపి, ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. పెరుగులోని విటమిన్‌-సి, జింక్‌, క్యాల్షియం చర్మాన్ని శుభ్రం చేస్తాయి. అరటిలోని లెప్టిన్‌ ప్రొటీన్‌ చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడడాన్ని నివారిస్తుంది.
దానిమ్మ గింజలు, తేనె: సున్నితమైన చర్మం కోసం దానిమ్మ గింజలు, చెంచాడు తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో రుద్దుకొని, అరగంట తర్వాత రోజ్‌వాటర్‌తో కడిగేయాలి. దానిమ్మల్లో విటమిన్‌-సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.