ముఖం మల్లెపువ్వులా...

06-06-2019: ముఖం తాజాగా కనిపించాలంటే లోపాలను సరిదిద్దే ఫేస్‌ ప్యాక్‌లు వేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఇంట్లోనే దొరికే వస్తువులతో ఆరోగ్యకరమైన ఫేస్‌ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. అవే ఇవి!
 
మొటిమలు: పసుపు, కలబంద గుజ్జు, టీ ట్రీ ఆయిల్‌, నిమ్మరసాలను సమపాళ్లలో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే మొటిమలు తగ్గుతాయి.
 
ముడతలు: పసుపు, రోజ్‌ ఆయిల్‌, గుడ్డు తెల్లసొనలను కలిపి ముఖానికి పూసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే, చర్మం బిగుతును సంతరించుకుంటుంది.
 
నల్లని వలయాలు: పసుపు, విటమిన్‌-ఇ నూనె, కలబంద గుజ్జు కలిపి కళ్ల కింద అప్లై చేసి,ఆ తర్వాత కడిగేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి.
 
చర్మం తెల్లగా: పసుపు, నిమ్మరసం లేదా నారింజ రసం, తేనె సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగితే చర్మపు నలుపు తగ్గుతుంది.