ముఖం మెరవాలంటే...

04-09-2018: కాంతి మంతమైన ముఖం కోసం ఫేస్‌మా్‌స్కలు తప్పనిసరి. వంటింట్లో లభించే పదార్థాలతో, అదీ తక్కువ టైంలోనే ఫేస్‌ ప్యాక్‌ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
శనగపిండి, తేనె, మీగడ: ఈ మూడింటిలో చర్మాన్ని కాంతిమంతం చేసే గుణాలుంటాయి. ఒక కప్పులో శనగపిండి, మీగడ తీసుకొని దానిలో కొద్దిగా తేనె కలిపి, పేస్టులా చేసుకోండి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమం స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది. ముఖం మీది మలినాలను తొలగించి, ముఖాన్ని కోమలంగా, మెరిసేలా చేస్తుంది. రోజూ ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది.
యోగర్ట్‌, అరటి పండు: అరటిపండులో పొటాషియం, విటమిన్‌ బి, విటమిన్‌ సితో పాటు తేమశాతం కూడా అధికంగా ఉంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. యోగర్ట్‌లోని లాక్టిక్‌ ఆమ్లం ముఖం మీది మృత కణాలను తొలగించి, కాంతిని ఇస్తుంది. అరటిపండును పేస్టులా చేసి, దానికి కొద్దిగా యోగర్ట్‌ కలపాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను వేసుకుని, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
కొబ్బరి నూనె, నిమ్మ రసం: ఇవి చర్మం డిహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి. ఈ రెండింటిని కలిపిన ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాసుకొని 10-15 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే సరి. మెరిసే ముఖ లావణ్యం మీ సొంతం.