చుండ్రు చికాకు పెడుతోందా?

ఆంధ్రజ్యోతి, 08-07-2017: స్వేద గ్రంథులనుంచి వచ్చే స్రావాలు మరీ ఎక్కువైపోవడం చుండ్రుకు ఒక ప్రధాన కారణం. వైరోస్టోరాన్‌ అనే వైరస్‌ కూడా చుండ్రుకు కారణం కావచ్చు. ఎండోక్రైనల్‌ గ్రంథులకు సంబంధించిన వ్యాధులు కూడా చుండ్రుకు కార ణం కావచ్చు. ఈ సమస్యలేమీ లేకపోతే, చుండ్రు సమస్యను గృహవైద్యంతోనే తగ్గించుకోవచ్చు.

గసగసాలను పాలతో నూరి, తలకు లేపనంగా వేస్తే చుండ్రు తగ్గుతుంది. లేదా...
మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి నూనె మాత్రమే మిగిలే దాకా కాచి, ఆ తైలాన్ని తలకు పట్టిస్తే చుండ్రు బాధ తొలగిపోతుంది.
మామిడి జీడి, కరక పలుపులు సమాన భాగాలుగా తీసుకుని పాలతోనూరి లేపనంగా వాడితే సమస్య నుంచి బయటపడవచ్చు.
గురువింద గింజల పొడిని నీటితో ముద్దగా చేసి, దానికి నాలుగు రెట్ల నువ్వుల నూనె, నాలుగు రెట్ల గుంట గలగరాకు రసాన్ని కలిపి, నూనె మాత్రమే మిగిలేదాకా మరగపెట్టాలి. చల్లారిన తర్వాత తలకు పట్టిస్తే, చుండ్రు నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వేపనూనె, కానుగనూనె సమంగా తీసుకుని కలిపి వాటితో కొంచెం కర్పూరం మిళితం చేసి తలకు పట్టిస్తే చుండ్రు బాధ తప్పుతుంది.
ఊ మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.