చెంపకు చారెడు కళ్లు...

25-12-2018:అందం విషయానికొస్తే కళ్లు మాత్రమే కాదు కనురెప్పలు కూడా మాట్లాడతాయి.కళ్లకు కాటుక, లైనర్‌ ఎక్కవ సార్లు ఉపయోగించడం వల్ల కనురెప్పలు చిన్నవిగా కనిపిస్తాయి. వంటింట్లో లభించే పదార్థాలతో కనురెప్పలు పెద్దవిగా కనిపించేలా చేయొచ్చు అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.
 
గ్రీన్‌ టీ: దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కనురెప్పలు పెరగడంలో తోడ్పడతాయి. చల్లార్చిన గ్రీన్‌ టీలో ముంచిన కాటన్‌ బాల్‌తో కనురెప్పల మీద మర్ధన చేసుకోవాలి. రెండు మూడు రోజులు ఇలాచేస్తే ఫలితం కనిపిస్తుంది.
 
ఆముదం నూనె: దీనిలోని ఫ్యాటీ ఆమ్లాలు కనురెప్పలు పెద్దగా, వొత్తుగా పెరిగేలా చేస్తాయి. ఆముదం నూనెలో ముంచిన కాటన్‌ బాల్‌తో కళ్ల మీద, ముఖ్యంగా కనురెప్పల మీద మసాజ్‌ చేసినట్టుగా రుద్దుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచేసి, ఉదయాన్నే నీళ్లతో కడిగేయాలి.
 
ఆలివ్‌ నూనె: వెంట్రుకలు పెరిగేందుకు ఆలివ్‌ నూనె ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే మందు అరచేతిలో కొద్దిగా ఆలివ్‌ నూనె తీసుకొని, కనుపాపల మీద మసాజ్‌ చేసుకోవాలి. ఉదయాన్నే కళ్లను గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
 
పెట్రోలియం జెల్లీ: ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కళ్ల మీద రాసుకుంటే చిన్నగా ఉన్న కనురెప్పలు, పెద్దవిగా కనిపిస్తాయి.