అరటితో ‘బ్లాక్‌’హెడ్స్‌!

01-02-2019: అరటిపండు తొక్క లోపలి భాగంతో రుద్దుకుంటే దంతాలు తెల్లబడతాయి.
 అరటి తొక్క లోపలి భాగంతో షూను రుద్దితే చక్కగా మెరుస్తాయి.
అరటిపండు గుజ్జును పాదాలకు రాసుకుని, రాత్రంతా ఉంచుకుంటే పగుళ్లు పోయి మృదువుగా తయారవుతాయి.
అరటిపండు గుజ్జును కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెత్తగా తయారవుతుంది.
అరటితొక్కను గుజ్జుగా చేసి వెండి సామాను శుభ్రం చేస్తే అవి తళతళలాడతాయి.
ఉడెన్‌ ఫర్నిచర్‌ మెరుగు తగ్గితే, అరటి తొక్కతో రుద్దాలి. అచ్చం పాలిష్‌ చేసినట్టు కనిపిస్తాయి.
అరటితొక్క లోపలి భాగంతో బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో రుద్దితే, అవి తేలికగా బయటకి వచ్చేస్తాయి.