వ్యర్థాలు పోతే వన్నె పెరిగినట్టే

31-08-2017: శరీరం డిటాక్సిఫై అయితే చర్మం మృదువుగా....పట్టులా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు పోయి శుభ్రంగా ఉంటుంది. దీనికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవి...
ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎంతో మంచిది. అలాగే ఉడకబెట్టిన కూరలు తీసుకుంటే ఒంటికి మంచిది.

రోజులో రెండు మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మంచిది. ఇందులోని పోలీఫెనాల్స్‌ శక్తివంతమైన యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

మంచినీళ్లు బాగా తాగాలి. ఆడవాళ్లయితే రోజుకు కనీసం 2.2 లీటర్ల నీటిని తాగాలి. ప్రధాన శరీర భాగాల్లోని విషపదార్థాలను నీరు బయటకు పంపేస్తుంది. అంతేకాదు పలు పోషకవిలువలను శరీరంలోని కణాలకు అందిస్తుంది.

పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న డైట్‌ తీసుకోవాలి. అలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండెజబ్బులు రావు. డయాబెటిస్‌, కేన్సర్‌, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తవు.

శరీరంలోని టాక్సిన్స్‌ పోయే వ్యాయామాలు కూడా చేయాలి.

శరీరాన్ని డిటాక్సిఫై చేసేటప్పుడు కాఫీ, ఆల్కహాల్‌ జోలికి వెళ్లకూడదు.

డైరీ ఉత్పత్తులు, గ్లూటెన్‌, మాంసం, కొవ్వులాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులు కొబ్బరినీళ్లు, పళ్లు, కూరగాయలు, జ్యూసులు, సలాడ్లు, స్మూదీస్‌, క్లియర్‌ సూప్‌, గ్రీన్‌ టీ, లెమొనేడ్‌, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి.