నిద్రకు ముందు అందం పదిలం

06-08-2018: అందం పది కాలాలపాటు పదిలంగా ఉండాలంటే నిద్రకు ముందు కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలి. అవేంటంటే....
పెదవుల మీద మృతకణాలు తొలగించి, తేనె రాసుకోవాలి. ఇలా చేస్తే ఉదయానికల్లా పెదవులు గులాబీలంత మృదువుగా తయారవుతాయి.
మొటిమల మీద తేనె పూసి, బ్యాండేజీతో కప్పాలి. ఉదయాన్నే కడిగితే, మొటిమలు తగ్గుతాయి.
ఆలివ్‌ నూనెలో తేనె కలిపి వెంట్రుకల కొసళ్లకు రాస్తే, స్ల్పిట్‌ ఎండ్స్‌ సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే ముఖ చర్మం కాంతిమంతమవుతుంది.
క్రమం తప్పకుండా రాత్రి పడుకునే ముందు మచ్చల మీద తేనె పూస్తుంటే కొద్ది రోజులకు మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.
తేనెలో నిమ్మరసం కలిపి పూసి, ఉదయాన్నే కడిగేసుకుంటూ ఉంటే బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.