వయసును బట్టి చికిత్సలెన్నో!

29-10-2018: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 20 ఏళ్లకే చర్మం మీద ముడతలు ఏర్పడినా, 35 ఏళ్లకే 50 ఏళ్ల వ్యక్తికి లాగా ముఖం మీద ముడతలు ఏర్పడినా, 50 లేదా 60 ఏళ్ల వాళ్లు వృద్ధాప్య ఛాయలు తొలగించుకోవాలనుకున్నా... ‘యాంటీ ఏజింగ్‌’ చికిత్సలను ఎంచుకోవచ్చు.
 
20 ఏళ్ల వాళ్లకు మైక్రోడెర్మాబ్రేషన్‌, గ్లైకోలిక్‌ పీల్స్‌, కెమికల్‌ పీల్‌ ట్రీట్మెంట్‌, లేజర్‌ పీల్‌ మొదలైన వాటితో ముడతలు తొలగించవచ్చు. రోగి రక్తం సేకరించి ప్లాస్మా, ప్లేట్‌లెట్లను వేరు చేసి, ఆ రక్తాన్ని తిరిగి చర్మం మీద డెర్మా రోలర్లతో అప్లై చేసే ‘వ్యాంపైర్‌ ఫేస్‌ లిఫ్ట్‌’ కూడా ఈ వయసు వారికి ఫలితాన్నిస్తుంది.
40 ఏళ్ల వారికి డైనమిక్‌ రింకిల్స్‌, స్టాటిక్‌ రింకిల్స్‌ రెండింటికీ వేర్వేరు చికిత్సలున్నాయి. స్టాటిక్‌ రింకిల్స్‌ను బొటాక్స్‌ ఇంజెక్షన్లతో, స్టాటిక్‌ రింకిల్స్‌ను ఫిల్లర్లు, త్రెడ్‌లతో సరిచేయవచ్చు. ఈ ఫలితం 6 నెలల నుంచి ఏడాది వరకే ఉంటుంది.
50 నుంచి 60 ఏళ్ల వయస్కులకు చర్మం అడుగు నుంచి చికిత్స చేసి ముడతలు తొలగించవచ్చు. అయితే ఏ వయసు వారికైనా, ఎలాంటి చికిత్స చేసినా ఫలితం పరిమిత కాలం మేరకే నిలిచి ఉంటుంది.
 
-డాక్టర్‌ స్వప్న ప్రియ
కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌, కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.