మచ్చలు మాయం!

14-02-2019: ముఖం మీది మచ్చలు, గాట్లు, మొటిమలను కవర్‌ చేయడానికి మేకప్‌ కన్‌సీలర్‌ వాడతాం! మచ్చను బట్టి తగిన రంగు కన్‌సీలర్‌ వాడితే ముఖం మచ్చలేని చందమామలా మెరిసిపోతుంది.
 
పసుపు రంగు: ముఖం కందిపోయినా, చర్మం అడుగున రక్తనాళాలు బయటకు కనిపిస్తూ, వంకాయ రంగులోకి మారినా పసుపు రంగు కన్‌సీలర్‌ అప్లై చేసి ఆ తర్వాత మేకప్‌ వేయాలి.
 
ఆకుపచ్చ: ఈ రంగు కన్‌సీలర్‌ ఎర్రబడిన చర్మం, మొటిమలు దాచడానికి, పగిలిన మొటిమలను దాచడానికి ఉపయోగించవచ్చు.
 
పింక్‌: నిర్జీవంగా ఉన్న చర్మం నిగారింపుగా కనిపించడానికి, ముదురు రంగు మచ్చలు దాచడానికి ఈ రంగు కన్‌సీలర్‌ వాడాలి.
 
పీచ్‌: కళ్ల కింద నల్లని వలయాలు, ముఖం మీద నల్ల మచ్చలు దాచడానికి ఈ కన్‌సీలర్‌ వాడాలి. ఎలాంటి కన్‌సీలర్‌ అయినా చర్మం మీద సమంగా పరచాలి. ఇందుకోసం మునివేళ్లనే వాడాలి.