మెంతులతో మృదువుగా...

25-10-2018: మెంతులు వంటలో రుచిని మాత్రమే కాదు... చర్మ మృదుత్వాన్ని కూడా పెంచుతాయి. మెంతుల్లోని సహజ నూనెలు, కొవ్వులు ముఖాన్ని, చర్మాన్ని కోమలంగా, ఆకర్షణీయంగా చేస్తాయి.

జిడ్డు చర్మం: గోరువెచ్చటి నీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత పేస్టులా చేయాలి. ఈ పేస్టుకు రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే జిడ్డు సమస్య తగ్గి చర్మం మృదువుగా మారుతుంది.
 
మృత కణాలు: మూడు కప్పుల నీటిలో మెంతులు వేసి మరగబెట్టాలి. చల్లారిని తర్వాత ఆ నీటిని ముఖం, చర్మం మీద రాసుకుంటే మృత కణాలు తొలగి, తాజాగా కనిపిస్తారు.
 
మాయిశ్చరైజర్‌: మెంతుల్లోని సహజ నూనెలు చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసి, మృదువుగా మారుస్తాయి.