రోజూ తలస్నానం చేయొచ్చా?

ఆంధ్రజ్యోతి: వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా?

కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’  అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన  షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి   వాష్‌ చేసుకోవచ్చు.