నెయిల్‌ కాన్వాస్‌!

02-08-2018: భావవ్యక్తీకరణ ముఖంలోనే కాదు, చేతుల్లోనూ కనిపిస్తుంది. చేతులూ మాట్లాడతాయి. చేతి వేళ్లూ అర్థాలను ఒలికిస్తాయి. కాబట్టి గోళ్ల అలంకరణ మీద కూడా దృష్టి పెట్టాలి. వాటికి కనువిందైన రంగుల హంగులు అద్దాలి! ఇందుకోసం నెయిల్‌ ఆర్ట్‌ ఎంచుకోవాలి!
 
ఫ్రీ హ్యాండ్‌
గోళ్లను కాన్వాస్‌లా భావించి, ఇదిగో ఇలా నచ్చిన లతలు, పూలు కూడా గీసుకోవచ్చు. కాకపోతే ఇందుకు కొద్దిగా సృజనాత్మకత అవసరం. సూదుల్లాంటి బ్రష్‌లు, తేలికగా ఆరిపోయే నెయిల్‌ పాలిష్‌ ఉంటే చాలు. బేస్‌ కోట్‌ నెయిల్‌ పాలిష్‌ వేసి, దాని మీద నచ్చిన డిజైన్లను చేత్తోనే గీసుకోవచ్చు.
 
గ్లిట్టర్‌ నెయిల్స్‌
గోళ్లు ధగధగలాడాలంటే గ్లిట్టర్‌ ఎఫెక్ట్‌ ఎంచుకోవాలి. నెయిల్‌ పాలిష్‌ వేసి, ఆరకముందే గ్లిట్టర్‌ అద్ది ఈ ఎఫెక్ట్‌ తీసుకురావచ్చు. డ్రస్‌కు నప్పే గ్లిట్టర్‌ ఎంచుకుంటే మరింత ఎట్రాక్టివ్‌గా కనిపిస్తారు.
 
క్రోమ్‌ కళ
గోళ్లు అద్దాల్లా మెరవడం మీకిష్టమా? అయితే సిల్వర్‌ లేదా రోజ్‌ గోల్డ్‌ నెయిల్‌ ఎనామిల్‌ ఎంచుకోండి. అవి మిరుమిట్లు గొలిపేంత బ్రైట్‌గా ఉండి తీరాలి. ఈ రంగులు అప్లై చేసేముందు నెయిల్‌ జెల్‌ ట్రీట్మెంట్‌ తీసుకుంటే గోళ్ల మీద రంగు రెండింతలు మెరుస్తుంది. రెండు లేయర్లలో వేస్తే ఇదిగో ఇలా అద్దంలా తళతళమంటుంది.
 
నెయిల్‌ ఎక్స్‌టెన్షన్స్‌
గోళ్లు తరచుగా విరిగిపోతూ, విసుగు తెప్పిస్తున్నాయా? ఏం ఫర్వాలేదు. గోళ్లను మరిపించే నెయిల్‌ ఎక్స్‌టెన్షన్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని రంగులేసి, గోళ్లకు అంటించుకుని ముచ్చట తీర్చుకోవచ్చు. నెయిల్‌ ఎక్స్‌టెన్షన్స్‌ వల్ల ఉన్న మరో ఉపయోగం, వీటికి రంగులు వేయడం తేలిక!
 
భావవ్యక్తీకరణ ముఖంలోనే కాదు, చేతుల్లోనూ కనిపిస్తుంది. చేతులూ మాట్లాడతాయి. చేతి వేళ్లూ అర్థాలను ఒలికిస్తాయి. కాబట్టి గోళ్ల అలంకరణ మీద కూడా దృష్టి పెట్టాలి
సాదా సీదా నెయిల్‌ పాలిష్‌ బోరు కొట్టిందా? అయితే గోళ్లను కళాఖండాలుగా మార్చే త్రీడి నెయిల్‌ టెక్నిక్‌ ఫాలో కండి! ఇందుకోసం ఇదిగో ఇలా నచ్చిన చమ్కీ, స్టోన్స్‌ ఎంచుకుని గ్లూతో గోళ్ల మీద రంగవల్లులు దిద్దండి!