పెదవులు గులాబీల్లా!

10-11-2017: చలికాలం వచ్చిందంటే పెదవులు పగలటం, పొడిబారి బిగదీసినట్టు అనిపించటం సహజం. అయితే ఈ ఇబ్బందిని అధిగమించాలంటే పెదవులు నాలుకతో తడపటం మాని, ఇదిగో ఈ చిట్కా పాటించండి. దెబ్బకి పెదవులు గులాబీల్లా మృదువుగా మారిపోతాయి.

టూత్‌బ్రష్‌ మీద కొద్దిగా కొబ్బరినూనె వేసి పెదవుల మీద వృత్తాకారంలో సున్నితంగా రుద్ది మృత కణాలను తొలగించాలి. దీంతో పెదవుల నలుపు వదిలి, నునుపుగా తయారవుతాయి. తర్వాత తాజా వెన్న లేదా వ్యాజిలైన్‌ను పెదవుల మీద వేలితో అద్ది సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే పెదవులు లేత గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి.