మంచు ముత్యం

11-09-2018: తేమ వాతావరణంలో చర్మం నిగారింపును కోల్పోతుంది. అలాంటప్పుడు మంచు ముక్కలతో చర్మానికి కొత్త కాంతిని తేవొచ్చు. శుభ్రమైన వస్త్రంలో మంచు ముక్కను ఉంచి, చర్మం మీద రుద్దాలి. మంచు శరీరాన్ని చల్లబరచడే కాకుండా, చర్మానికి మెరుపును కూడా ఇస్తుంది.
మంచు ముక్కలు స్వేద గ్రంథులు మూసుకునేలా చేసి, శరీరం నుంచి చెమట వెలువడడాన్ని కొద్దిసేపు నివారిస్తాయి. చర్మం ఎర్రగా కందిపోయిన దగ్గర, వాపు దగ్గర మంచును ఉంచితే నొప్పి తగ్గి, ఉపశమనం లభిస్తుంది.
కళ్ల కింద మడతలను మంచుతో పోగొట్టవచ్చు. వస్త్రంలో ఉంచిన మంచు ముక్కను కళ్ల కింది వలయాల మీద 20 నిమిషాలు ఉంచాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే, కళ్ల కిందవలయాలు పోతాయి.
పొడిచర్మం ఉన్నవారు రెండు లేదా మూడు బాదం గింజల పేస్టును మంచు ముక్కలతో కలిపి రుద్దుకుంటే చర్మం తిరిగి మామూలు స్థితికి వస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు నిమ్మరసంలో అద్దిన మంచు ముక్కలతో చెమట వాసన వచ్చే భాగాల్లో రుద్దితే దుర్గంధం పోతుంది.
ఎండకు చర్మం కమిలిపోతే కలబంద గుజ్జులో అద్దిన మంచు ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే చర్మానికి పోషణ అందుతుంది.