బొప్పాయితో.. అందం, ఆరోగ్యం

28-11-2017: మనం నిత్యం బొప్పాయి పండ్లను మార్కెట్‌లో చూస్తుంటాం. కానీ అంతగా పట్టించుకోం. బొప్పాయి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. దీనిని తినేముందు ఎవరైన ఒక్క క్షణం ఆలోచిస్తారు.. ఎందుకంటే బొప్పాయి తింటే వేడిచేస్తుందని. ఇలాంటి భయాలు, అపోహలు దూరం కావాలంటే శరీరానికి అది చేసే మేలు ఏంటో తెలుసుకోవాల్సిందే..

 
ఆరోగ్యానికి..
బొప్పాయిలో కొవ్వు, మాంసకృతులు తక్కువ మోతా దులో ఉంటాయి. వందగ్రాముల బొప్పాయిపండులో 32కేలరీలతో పాటు సోడియం ఏ, బీ, సీ విటమిన్లు కె రోటిస్‌, బీటా కెరోటిస్‌ వంటి ఖనిజ లవణాలు లభి స్తాయి. దీనిలోని విటమిన్‌ సీ రోగ నిరోధక శక్తిని పెం చుతుంది. మిటమిన్‌ ఏ సమృద్దిగా ఉండటం వల్ల దృ ష్టిలోపాలను సైతం తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే పాపామ్‌లు, ఎంజైమ్‌లు మన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మాంసకృతులు త్వరగా జీర్ణమ వ్వడానికి ఉపకరిస్తాయి. అందుకే దీనిని మాంసంతో క లిపి ఉడికిస్తారు. ఒంటి నొప్పుల నివారణలో సమర్థవ ంతంగా పని చేస్తుంది..
 
మంచి ఔషధం..
దీనిలో పుష్కలంగా ఉండే బిటా కెరోటిన్‌ శరీరానికి హా ని చేసే ఫ్రీ రాడికల్స్‌ దుష్ఫ లితాలను నివారించి క్యాన్సర్‌ రాకుండా నియంత్రణలో ఉం చుతుంది. బొప్పాయిలోని పీచు పదార్థం మలబద్దకానికి మంచి ఔ షధం. నెలసరి సమయంలో సమస్యలతో బా ధపడే మహిళలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మూత్రవిసర్జన సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం.
 
అందానికి..
స్నానం చేయడానికి అరగంట ముందు బొప్పాయిపండు గుజ్జును శరీరానికి పట్టించాలి. ఇందులోని విట మిన్‌ ఈ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులు, స మస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి చెట్టు పూలను పేను కొరుకుడు నివారణకు వాడుతారు. పచ్చి బొప్పా యికాయ పొట్టును మెత్తగా చేసి దానికి కొంచెం వెనిగర్‌ చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గు ముఖం పడతాయి. దీనిని పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. బొప్పాయి గుజ్జు వెనిగర్‌ను నిమ్మరసాన్ని సమపాలలో కలిపి శాంపుమాదిరిగా తయారు చే యాలి. దీని జట్టుమొత్తానికి రాసుకుని కొన్ని నిమిషాల తర్వాత త లస్నానం చేయాలి చుండ్రునివారణలో ఇది మంచి ఔషధం, పచ్చి బొ ప్పాయి నుంచి తీసిన పాలను కమిలిన చర్మంపై రాస్తే కొద్దిరోజుల్లోనే చర్మం సాధారణ రంగులోకి వస్తుంది.
- రుద్రూరు