‘ఐ లైనర్‌’ ఇలా!

10-01-2018: లైనర్‌తో కళ్లు విప్పారినట్టు కనిపిస్తాయి. అలాంటి అందం సొంతమవాలంటే ఐ లైనర్‌ అప్లై చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.

మంచి ప్రొడక్ట్‌ ఎంచుకోవాలి
లైనర్‌ క్రీమీగా ఉంటే కనురెప్పల మీద మెత్తగా జరుగుతుంది. వేసుకోవటం తేలిక. ఇలాంటి క్రీమీ లైనర్‌లోనే స్మడ్జర్‌ కూడా కలిసి ఉంటే బ్లెండ్‌ చేయటం ఎంతో ఈజీ. కాబట్టి వాటర్‌ప్రూఫ్‌, బిల్డ్‌ ఇన్‌ స్మడ్జర్‌ క్రీమీ ఐలైనర్‌నే ఎంచుకోవాలి.

కూర్చుని వేయాలి

లైనర్‌ వేసుకోవటానికి ఉపయోగించే అద్దం ఫ్లాట్‌గా ఉండే ప్రదేశంలో మీరు కూర్చున్న ప్రదేశానికి తక్కువ ఎత్తులో ఉండాలి. ఇలా ఉంటే కళ్లను కిందకి దించి సులువుగా లైనర్‌ వేసుకోవచ్చు. లాష్‌ లైన్‌ కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి కనురెప్పలకు ఆనుకున్నట్టు లైన్‌ గీసుకోవచ్చు.

డాట్స్‌ కనెక్ట్‌ చేయాలి

లైన్‌ వంకర లేకుండా రావాలంటే కన్ను మొదలు నుంచి చివరివరకు కనురెప్పలకు కొద్దిగా పైన వరుసగా 3 చుక్కలు పెట్టాలి. తర్వాత లైనర్‌తో ఈ చుక్కల్ని కలుపుతూ లైన్‌ గీసుకుంటే వంకర లేకుండా ఉంటుంది.
లైనర్‌ సమంగా లైనర్‌ మందంగా వేస్తే కళ్లు చిన్నవిగా, పలుచగా వేస్తే పెద్దవిగా కనిపిస్తాయి. కాబట్టి కంటి ఆకారాన్ని బట్టి లైనర్‌ ఎంత మందంగా వేసుకోవాలో
తెలుసుకోవాలి.