చలిలో అందంగా!

12-12-2017: చలి చర్మాన్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. బిగదీస్తుంది, బీటలు బారుస్తుంది, చిటపటమనిపిస్తుంది. ఈ తిప్పలు తప్పించుకోవాలంటే ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి.

శీతాకాలం ఎండ చర్మాన్ని డ్యామేజ్‌ చేస్తుంది. కాబట్టి మాయిశ్చరైజర్‌ కలిసిన సన్‌స్ర్కీన్‌ ఈ కాలంలో తప్పనిసరిగా వాడాలి.
చలి గాలులు, చల్లటి వాతావరణానికి గురైతే చర్మం చిట్లుతుంది. కాబట్టి మఫ్లర్‌, స్కార్ఫ్‌ వాడాలి.
స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ వాడాలి.
తరచుగా లిప్‌బామ్‌ అప్లై చేస్తూ ఉండాలి.
ఫేస్‌ ప్యాక్‌లు, టోనర్లు, యాస్ట్రింజెంట్లు ఈ కాలంలో వాడకూడదు.
రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగటం తప్పనిసరి.
సిట్రస్‌ జాతి పళ్లు (నిమ్మ, నారింజ, బత్తాయి) తినటం వల్ల తగినంత సి విటమిన్‌ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.