వర్షాకాలంలో...

30-07-2017: వర్షాకాలంలో ఓట్‌మీల్‌ ఫేస్‌ప్యాక్‌ ముఖసౌందర్యానికి మేలు చేస్తుంది. ఓట్‌ మీల్‌ - మూడు టీస్పూన్లు, గుడ్డు (తెల్ల సొన) - ఒకటి, తేనె, పెరుగు - ఒక్కో టీస్పూన్‌ చొప్పున తీసుకుని బాగా కలిపి ఫ్రిజ్‌లో కొంచెంసేపు ఉంచాలి. తరువాత ముఖాన్ని కడిగి ప్యాక్‌ వేయాలి. బాగా ఆరాక నీళ్లతో ముఖాన్ని కడిగేయాలి.