మేకప్‌ లేకుండానే అందంగా...

13-11-2018: ఒక్కోసారి మేకప్‌ మీ అందాన్ని రెట్టింపు చేయకపోగా లేనిపోని చికాకులు తెచ్చిపెడుతుంది. లిప్‌స్టిక్‌, కాటుక, మేకప్‌ పౌడర్‌ రోజూ ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు చర్మానికి హాని కలుగుతుంది. మేకప్‌ లేకుండానే, సహజంగా అందంగా కనిపించేందుకు ఏం చేయాలంటే...
ఎండలో బయటకు వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. ఇది ఎండకు చర్మం పొడిబారకుండా చూస్తుంది.
రోజూ ఉదయాన్నే కప్పు వేడి నీటిలో, నిమ్మరసం కలుపుకొని తాగాలి. నిమ్మరసం శరీరంలోని మలినాలను తొలగించి, శరీరాన్ని శుద్ధిచేస్తుంది.
ముఖం మీది మృతకణాలు అలాగే ఉండడం వల్ల స్వేదగ్రంథులు మూసుకుపోయి చర్మం డల్‌గా కనిపిస్తుంది. వాటిని స్క్రబ్బర్‌ సాయంతో తొలగించాలి. మీ చర్మం తత్వాన్ని బట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు మృతకణాలను తొలగించుకోవాలి.
ముఖం పొడిబారినట్లు ఉంటే టోనర్‌ ఉపయోగించాలి. చర్మం పీహెచ్‌లో మార్పుల్ని టోనర్‌ నివారిస్తుంది. చర్మానికి జీవాన్నిస్తుంది.