అరటిపండు మాస్కుతో...

30-10-2018: ఫ్రూట్‌ మాస్కులతో చర్మం మృదువుగా మారుతుంది. బ్యూటీ మాస్కుల్లో అరటిపండు మాస్కు కూడా ఒకటి. అరటిపండు, తేనె కలిపిన ఈ మాస్కును ఎలా చేయాలంటే...  

అరటి పండు తొక్క ఒలిచి గుజ్జును చిన్న ముక్కలు చేయాలి.
ఈ ముక్కలను మిక్సీలో వేసి పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
బౌల్‌లో టీస్పూను మెత్తటి అరటిపండు గుజ్జు, మరో టీస్పూను తేనె వేసి కలపాలి. 
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి.
ఇలా అరటిపండు, తేనె మాస్కును ముఖానికి రాసుకున్న తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.
ఆతర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ఇలా రోజూ చేస్తే చర్మం మృదువుగా, పట్టులా మెరుస్తుంది. తాజాదనంతో వెలిగిపోతుంది.
లాభాలు
ఇది చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
అరటిపండులోని ఎ-విటమిన్‌ చర్మంలో లోపించిన తేమను తిరిగి పొందేట్టు తోడ్పడుతుంది. దెబ్బతిన్న, పొడారిపోయిన, కాంతివిహీనంగా ఉన్న చర్మాన్ని బాగుచేస్తుంది. అరటిపండులో చర్మం ముడతలు పడకుండా నివారించే పదార్థాలు ఉన్నాయి. ఇవి ఏజ్‌ స్పాట్లు పోయేట్టు చేస్తాయి. చర్మంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. ఫలితంగా చర్మం ముడతలు తొలగి, యవ్వనంతో కనపడుతుంది.
మొటిమలు, నల్లమచ్చలు పోగొట్టడంలో అరటిపండు మాస్కు బాగా పనిచేస్తుంది.
చర్మం పై పొరలకు కావలసిన తేమను తేనె అందిస్తుంది. ఫలితంగా చర్మం తొందరగా ముడతలు పడదు.
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వయసు మీద పడ్డ లక్షణాలు చర్మం మీద తొందరగా కనపడవు. అంతేకాదు చర్మం మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మంపై చేరిన మురికిని కూడా ఈ మాస్కు పోగొడుతుంది.