వయసు కనిపించకుండా...

26-12-2017: వయసు పైబడకుండానే చర్మంపై గీతలు పడడం, కాంతివిహీనంగా తయారవడం చూస్తుంటాం. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని చిల్కాలు పాటించాలి. అవి...

చర్మాన్ని తేమగా ఉంచేందుకు మూలికలతో కూడిన క్రీములు వాడాలి.
ఆరోగ్యవంతమైన చర్మం కోసం సమతులాహారాన్ని తీసుకోవాలి.
విటమిన్లు బాగా ఉండే పళ్లు, సలాడ్లు, జ్యూసులు, ఆకుకూరలు తీసుకోవాలి.
జ్యూసుల్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మెరుపునిస్తాయి.
బాగా నిద్ర పోతే చర్మం నిగ నిగలాడుతుంది. రాత్రి పడుకోబోయేముందు మూలికల క్రీము రాసుకుంటే చర్మానికి కావలసినంత తేమ లభిస్తుంది. ఫలితంగా చర్మం యవ్వనమెరుపుల్ని చిందిస్తుంది.
కళ్ల కింద భాగం సున్నితంగా ఉంటుంది. ముడుతలు ప్రారంభమయ్యేది అక్కడే. అందుకే మూలికలతో చేసిన క్రీమును కళ్ల కింద నిత్యం రాసుకోవాలి. అలసిన కళ్లకు ఈ క్రీము ఎంతో సాంత్వననిస్తుంది. కళ్ల కింద ఉన్న చర్మానికి తేమనందించి, ఆ భాగాన్ని మృదువుగా ఉంచుతుంది.
ఒత్తిడి వల్ల కూడా చర్మం ముడుతలు పడుతుంది. కాంతివిహీనమైన చర్మం, ముడుతలు పెద్దతనానికి సూచనలు. ఇవి ఏర్పడకుండా ఉండాలంటే నిత్యం యోగ, ధ్యానాలు చేస్తే మంచిది. వీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో హార్మోన్ల సమతౌల్యం సురక్షితంగా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడిని అధిగమించడమే కాకుండా మెదడు, చర్మం రెండూ కూడా కొత్త జీవం పోసుకుంటాయి.