ఛాతీలో అగ్ని గుండం!

ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది. ఛాతీలో మంట, గొంతులోకి తన్నుకొచ్చే జీర్ణరసాలు, పుల్లని త్రేన్పులు...ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. 

ఈ ఇబ్బందులను అధిగమించాలంటే....

  • నియమిత ఆహార వేళలు పాటించాలి.
  • సమయానికి ఆహారం తినడం మానకూడదు.
  • మితి మీరి ఆహారం తీసుకోకూడదు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేటంత ఖాళీ వదలాలి.
  • పుల్లని, తీపి పదార్థాలు తినకూడదు.
  • తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి.
  • ఎసిడిటీ ఉన్న వారు తేలికగా జీర్ణమయ్యే అన్నం
  • తినాలి. 
  • జంక్‌ ఫుడ్‌లో ఉండే కొవ్వులను అరిగించుకోవడానికి అధిక పరిమాణంలో జీర్ణరసాలు ఊరతాయి. కాబట్టి కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 
  • తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 40 నిమిషాల వరకైనా నిటారుగా నిలబడడం లేదా కూర్చోవడం చేయాలి.